Friday, May 3, 2024

సాగర్‌ ఆయకట్టు రైతుల్లో ఆశలు.. యాసంగికి 65 టిఎసీల నీటి విడుదల

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: ఆరుదశాబ్దాలుగా కేవలం కరీఫ్‌ కు మాత్రమే సాగునీరు అందించిన శ్రీరామంసాగర్‌ యాసంగికి పంటకు నీళ్లు పరవళ్లుతొక్కుతున్నాయి. రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ యాసంగి పంటల్లో నిమగ్నమయ్యారు. అవాంతరాలను అధిగమించి నిండుకుండలా పరవశించిపోతున్న శ్రీరామంసాగర్‌ ప్రస్తుతం యాసంగిలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వేలాదిఎకరాల స్థిరీకరణ జరగనుందని అధికారులు అంచనావేస్తున్నారు. మహారాష్ట్ర బాబ్లిd ప్రాజెక్టునిర్మించడం, సమైక్యపాలకులు కనీసం పూడికతీయకపోవడంతో వర్షకాలంలోను ప్రాజెక్టులో సగం వరకు నీరు నిండలైదు. స్వరాష్ట్రం సిద్ధించగానే సీఎం కేసీఆర్‌ శ్రీరాంసాగర్‌ పునరుద్ధరణ చేపట్టి పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో ప్రస్తుతం 90 టీఎంసీల నీటితో జలకళ సంతరించుకుంది.

ఆరుదశాబ్దాలుగా ఒక్కపంటకు అదీ కూడా దిగువమానేరు ఆయకట్టు వరకు మాత్రమే నీరందించిన శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు ప్రస్తుతం కాలువలు పూర్తి సామర్ధ్యంతో పరవళ్లుతొక్కు తున్నాయి. ఏనాడు 4వేల క్యూసెక్కులకు మించని కాకతీయ కాలువ ప్రస్తుతం 347 క్లీమీటర్ల పొడవున 8వేలక్యూసెక్కులతో నిండుగా పారుతుంది. శ్రీరాంసాగర్‌ ప్రతిపాదితలక్ష్యాలను సుసంపన్నం చేస్తున్నది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు స్టేజ్‌ వన్‌ కింద ఉన్న చివరి ఆయకట్టువరకు నీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులుచేపట్టి 2018 నాటికి 11,12,064ఎకరాలకు సాగనీటిని అందించి చరిత్రసృష్టించింది. అలాగే ఆయకట్టు పరిధిలోని ప్రధాన కాలువ, డిస్ట్రి బ్యూటరీలు,మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల్లో నీరు నింపి ఆయకట్టులోని చివరిచెరువు సూర్యాపేట లోని రాయి చెరువు వరకు నీటిని నింపు సాగుభూముల్లో నీరు ప్రవహింపచేశారు. అయితే రైతులకు ఆయకట్టు భరోసా ప్రభుత్వం కల్పిస్తూ శ్రీరాం సాగర్‌ జలాశయంలో నీరు తగ్గినా కాళేశ్వరం వరద కాలువ నుంచి శ్రీరాజేశ్వర జలాశయానికి తరలించే ప్రాణహిత జలాలను వరదకాలువదావారా వెనక్కి పంపింగ్‌ చేసి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నీరు పోసేందుకు పూర్తిస్థాయి సామర్ధ్యాన్ని కలిగిఉంది.

యాసంగికి నీటి విడుదల

- Advertisement -

ప్రస్తుత యాసంగిలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు కు 65 టిఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే క్రమంగా నీటి అవసరాల దృష్ట్యా నీటి విడుదలను కూడా పెంచేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలను రూపొందించిందని సంబంధిత అధికారులు చెప్పారు. ప్రస్తుత యాసంగిలో 65 నుంచి 90 టీఎం సీ లవరకు నీరు అందించేందుకు ఇరిగేషన్‌ శాఖ సిద్ధంగా ఉంది లక్షల ఎకరాలు తడి,పొడి పంటలకు ఈ నీరు పుష్కలంగా సరిపోతాయని అధికారులు అంచనావేశారు. ప్రతిసంవత్సరం యాసంగిలో నీటి ని విడుదల చేస్తుండటంతో శ్రీరాంసాగర్‌ పరిధిలో ఆయకట్టు స్థిరీకరణ ఆశాజనకంగా జరుగుతుందని ఆధికారులు చెప్పారు.శ్రీ రాం సాగర్‌ నుంచి కాకతీయ కాలువ 146.920 ఎకరాలు, దిగువ కాకతీయ కెనాల్‌ 146-284 కిలో మీటర్ల వరకు 5, 05720 ఎకరాలు మొత్తం కలిసి 9,68,640 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు.

ఇందులో నిజమాబాద్‌ ఆయకట్టుకు 34,945ఎకరాలు, జగిత్యాలకు 1,80,391, పెద్దపల్లి 1,06,811 కరీంనగర్‌ కు 2,24,713, నిర్మల్‌ 35,735, వరంగల్‌ రూరల్‌ కు 1,32,044 ఎకరాల ఆయకట్టుకు ప్రసుత యాసంగిలో నీరు అందనుంది. ఒడిసిపడుతున్న నీటిని సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంబహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నది. తొలుత వారాబంధీ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానంలోఎలాంటి వివాదాలు లేకపోవడంతోప్రస్తుతం కూడా అదే విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలను రూపొందించింది. అయితే సమైక్యపాలనలొశ్రీరాం సాగర్‌ నుంచి యాసంగి, కరీఫ్‌ కు కలిసి కనీసం 10 లక్షల ఎకరాలకు నీరు అందివ్వని రోజుల నుంచి ఒక్కయాసంగిలోనే సుమారు 10లక్షల ఎకరాలకు నీరు అందించే స్థాయికి తెలంగాణ ఎదగడం ప్రశంసనీయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement