Thursday, May 16, 2024

హోంబ‌లే ప్రొడ‌క్ష‌న్ లో ఫాహ‌ద్ ఫాజిల్ – హీరోయిన్ గా అప‌ర్ణ‌బాల‌ముర‌ళీ

కేజీఎఫ్ అంటే హోంబ‌లే ప్రొడ‌క్ష‌న్ గుర్తుకువ‌స్తుంది. అంతాల పేరుని సంపాదించుకుంది ఈ సంస్థ‌. కాగా ఈ సంస్థ‌లో మ‌రో మూవీ తెర‌కెక్క‌నుంది అంటే చాలా హోప్స్ ఉంటాయి. ఈ సంస్థ తాజాగా తన నెక్స్ట్‌ చిత్రాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్‌ 9నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనుంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌చేస్తున్నారు. ధూమం’ అనే కాన్టెప్ట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు హోంబలే సంస్థ తాజాగా ప్రకటించింది. మలయాళ స్టార్ ఫాహద్‌ ఫాజిల్‌ హీరోగా నటించనున్నారు. నేషనల్ అవార్డు గ్రహిత న‌టి అపర్ణ బాలమురళీ హీరోయిన్‌ నటించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా టైటిల్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సౌత్‌ లోని అన్ని భాషల్లో రూపొందించనున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement