Sunday, October 13, 2024

బిగ్ బాస్ షో నిలిపివేయాల‌ని పిటిష‌న్ … విచార‌ణ అక్టోబ‌ర్ 11కు వాయిదా

బిగ్ బాస్ షో ఆపేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలిపారు. ఐబీఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం సమయాన్ని పాటించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకే బిగ్ బాస్ షో ప్రసారం చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. కాగా ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఐబీఎఫ్ గైడ్ లైన్స్ పాటించ‌లేద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది శివ‌ప్ర‌సాద్ రెడ్డి తెలిపారు. అశ్లీల‌త‌పై న్యాయ‌స్థానం ఘాటుగా స్పందించింది. ప్ర‌తివాదుల‌కు నోటీసుల‌పై త్వ‌ర‌లో నిర్ణ‌యిస్తామ‌ని హైకోర్టు తెలిపింది. త‌దుప‌రి విచార‌ణ‌ను హైకోర్టు అక్టోబ‌రు 11కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement