Friday, April 26, 2024

విద్యార్థుల‌కి.. నిత్యామీన‌న్ పాఠాలు

విద్యార్థుల‌కి పాఠాలు చెప్పింది హీరోయిన్ నిత్యామీన‌న్. ఇది షూటింగ్ కాదండోయ్..నిజంగానే ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పింది. షూటింగ్ బ్రేక్ లో దగ్గర్లోని స్కూల్ కు వెళ్లి పిల్ల‌ల‌కి పాఠాలు చెప్ప‌డం విశేషం.ఓ మలయాళ సినిమా షూటింగ్ కోసం నిత్యామేనన్ కృష్ణాపురం అనే గ్రామానికి వచ్చారు. షూటింగ్ బ్రేక్ లో దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. విద్యార్థులు, టీచర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలకు ఇంగ్లిష్ పాఠం చెప్పారు.కృష్ణాపురం గ్రామంలోని ఈ చిన్నారులతో కొత్త ఏడాదిలో మొదటిరోజు ఇలా గడిచిపోయిందని కామెంట్ జోడించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నిత్యాను మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారంటూ కితాబిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా తెలుగులో వివరిస్తూ పాఠం చెబుతున్న వీడియోను ఆమె తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. చక్కటి తెలుగులో మాట్లాడుతూ, ఇంగ్లిష్ పాఠాన్ని చదివి వినిపిస్తూ, తెలుగులో అర్థం చెబుతూ పాఠశాలలో సందడి చేశారు. ఇదంతా రికార్డు చేసి నిత్యామేనన్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement