Friday, May 3, 2024

థాంక్యూ నుంచి మెలోడియ‌స్ సాంగ్ రిలీజ్ చేయ‌నున్న మేక‌ర్స్

హీరో నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న తాజా చిత్రం థాంక్యూ. విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు..శ్రీవెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు.ఈ చిత్రం జూలై 8న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం వ‌రుస అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నారు. తాజాగా మేక‌ర్స్ మ‌రో అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలోని ‘ఏంటో ఏంటోంటో’ అంటూ సాగే మెలోడియ‌స్ సాంగ్‌ను గురువారం సాయంత్రం 5గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాట‌ను జోనిత గాంధి ఆల‌పించింది. ఇదివ‌ర‌కే చిత్రం నుంచి విడుద‌లైన ‘మారో మారో’ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రంతో నాగ‌చైత‌న్య‌కు జోడీగా రాశీఖ‌న్నా, మాళ‌విక నాయ‌ర్‌, అవికా గోర్ హీరోయిన్‌లుగా న‌టించారు. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీ.సీ శ్రీరామ్ ఛాయ‌గ్ర‌హ‌కుడిగా ప‌నిచేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement