Monday, April 29, 2024

దూసుకుపోతున్న అడివిశేషు.. గూఢ‌చారి2పై అప్ డేట్

వ‌రుసగా సినిమాలు చేస్తూ విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు ప్రముఖ యంగ్ హీరో అడవి శేష్. క్షణంతో మొదలైన అతని హిట్ సినిమాల పరంపర ప్రస్తుతం ఆరు వరుస సక్సెస్ లతో కొనసాగుతున్నాడు. మేజర్ సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు హీరో అడవి శేష్..నేచుర‌ల్ స్టార్ హీరో నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను బాగా మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ మీద కన్నేశాడు అడవి శేష్. ఆ సినిమానే గూడాచారి 2. ఈ మూవీని శశికరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్నారు. గూడచారి తర్వాత మేజర్ సినిమాను కూడా శశికిరణ్ డైరెక్టర్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై కీలక ప్రకటన చేశారు. జనవరి 9న ఈ సినిమాపై మరో ప్రకటన చేయనున్నట్లు ఓ పోస్టర్‌ ద్వారా ప్రకటించారు. మ‌రి ఈ చిత్రం క‌నుక హిట్ అయితే అడ‌విశేషుకితిరుగులేన‌ట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement