Friday, May 3, 2024

బాల‌కృష్ణ‌తో ఆడిపాడ‌నున్న – డింపుల్ హ‌య‌తి

ఐటెం సాంగ్స్ లో ఆడిపాడ‌టానికి ఈ మ‌ధ్య‌కాలంలో స్టార్ హీరోయిన్స్ కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. కాగా గద్దలకొండ గణేశ్’ సినిమాలో ‘జర్రా జర్రా’ ఐటమ్ సాంగ్ తో ఆమె కుర్రకారు మతులు పోగొట్టింది డింపుల్ హ‌య‌తి . ఆ తరువాత రవితేజ సరసన కథానాయికగా ‘ఖిలాడి’ సినిమాలో అందాలను ఆరబోసింది. ప్ర‌స్తుతం ఆమె నంద‌మూరి హీరో బాలకృష్ణతో కలిసి మాస్ మసాలా సాంగ్ లో సందడి చేయనున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య 107వ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కథ రాయలసీమ నేపథ్యంలో నడుస్తుంది. బాలకృష్ణ సరసన హీరోయిన్ గా శ్రుతి హాసన్ అలరించనుంది. ఈ సినిమా కోసం మాస్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ నెంబర్ ను తమన్ కంపోజ్ చేశార‌ట. ఆ పాటను డింపుల్ పై చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement