Friday, May 17, 2024

భారీ వ‌ర్షాలు.. 10 రైళ్లు ర‌ద్దు

తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో 10 రైళ్ల‌ను పాక్షికంగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మ‌రో రెండు రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్‌(07077/07078), సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ మెమూ స్పెష‌ల్(07055), మేడ్చ‌ల్ – ఉందాన‌గ‌ర్ మెమూ స్పెష‌ల్(07076), ఉందాన‌గ‌ర్ – సికింద్రాబాద్ మెమూ స్పెష‌ల్(07056), సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ – సికింద్రాబాద్ మెమూ స్పెష‌ల్(07059/07060), హెచ్ఎస్ నాందేడ్ – మేడ్చ‌ల్ – హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజ‌ర్ స్పెష‌ల్(07971/07970), సికింద్రాబాద్ – మేడ్చ‌ల్ మెమూ స్పెష‌ల్(07438), మేడ్చ‌ల్ – సికింద్రాబాద్ మెమూ స్పెష‌ల్(07213), కాకినాడ పోర్ట్ – విశాఖ‌ప‌ట్ట‌ణం – కాకినాడ పోర్ట్ మెమూ(17267/17268), విజ‌య‌వాడ – బిట్ర‌గుంట – విజ‌య‌వాడ మెమూ(07978/07977) రైళ్ల‌ను సోమ‌వారం నుంచి బుధ‌వారం వ‌ర‌కు పాక్షికంగా ర‌ద్దు చేశారు. కాకినాడ పోర్ట్ – విజ‌య‌వాడ ఎక్స్‌ప్రెస్‌(17258), విజ‌య‌వాడ – కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌(17257) రైళ్ల‌ను ర‌ద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement