Wednesday, March 29, 2023

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం ప‌ట్టుకున్నారు క‌స్ట‌మ్స్ అధికారులు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరిపై అనుమానం రావడంతో తనిఖీ చేశారు. వారివద్ద 3.4 కిలోల బంగారాన్ని అక్రమ తరలిస్తున్నారని గుర్తించారు. దాని విలువ రూ.1.87 కోట్లు ఉంటుందని చెప్పారు. మలద్వారంతోపాటు లోదుస్తుల్లో బంగారం దాటి తరలిస్తున్నారని వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement