Tuesday, April 23, 2024

Cold wave | చలికాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువ… అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌

చలి తీవ్రత మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువ అని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ హెచ్చరించింది. చలికి సిరలు మరింత కుంచించుకుపోవడంతో గట్టిపడే ప్రమాదం ఉందని పేర్కొంది. దాంతో రక్తప్రసరణ పెరిగి గుండెపోటు ప్రమాదం పెరగనుందని హెచ్చరించింది. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి చలికాలం మరింత ప్రాణాంతకంగా మారుతుందని స్పష్టం చేసింది. చలికాలంలో పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలని, క్యారెట్‌, బచ్చలికూర, బీట్‌రూట్‌, దానిమ్మ, టమాట, ద్రాక్ష పళ్లను ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు.

చలికాలంలో గుండెపోటు ప్రమాదం పెరిగేందుకు కారణాలను వివరిస్తూ అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ఏటా డిసెంబర్‌ 25 నుంచి జనవరి 5 మధ్య గుండె జబ్బులకు సంబంధించిన మరణాల రేటు ఎక్కువగా పెరుగుతోంది. చల్లటి వాతావరణం కారణంగా నీరు తాగడం చాలా వరకు తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్లో మంచి ఆహారంతోపాటు సరైన మొత్తంలో నీరు తాగాలని సూచిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చలికాలంలో పలు జాగ్రత్త్తలు తీసుకోవాలని గుండె వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement