Friday, May 3, 2024

గ్రామాల్లో ఆరోగ్య సేవలను విస్తరించాలి: డాక్టర్ ఎం.సుహాసిని..

మచిలీపట్నం, ప్ర‌భ‌న్యూస్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు సిబ్బంది సమిష్టిగా పని చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి శ్రీమతి డాక్టర్ ఎం.సుహాసిని అన్నారు. మచిలీపట్నం డిఎంహెచ్ వో కార్యాలయంలో సోమవారం మచిలీపట్నం గుడివాడ డివిజన్ల వైద్యులు, ప్రోగ్రాం అధికారులతో వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై సమీక్షి జ‌రిపారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ శ్రీమతి డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలన్నారు. గర్భిణీలు వివరాలను ఎప్పటికప్పుడు ఆర్ సిహెచ్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. మాతాశిశు మరణాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గ్రామాల్లో అందించే అన్ని రకాల వైద్య కార్యక్రమాల వివరాలను సకాలంలో వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు.

కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు, వ్యాక్సిన్ ప్రక్రియను లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాన్స్ ప్రోగ్రామును విజయవంతం చేయాలన్నారు. ఎన్సీడీ ,సర్వే ఫీవర్ సర్వే లపై దృష్టి పెట్టాలన్నారు. వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేసేలా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కరిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందిస్తూనే డాక్టర్లు గ్రామాల్లో కూడా పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. మాతాశిశు మరణాల నివారణపై కృషి చేయాలన్నారు .న్యూ బార్న్ వీక్ లో భాగంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చైతన్యం కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా శిక్షణ విభాగం ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ అమృత, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వంశీ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement