Thursday, May 16, 2024

HanuMan | రేపు హనుమాన్ 3వ సింగిల్.. ఇంట్రెస్టింగ్‌గా ‘ఆవకాయ ఆంజనేయ’ సాంగ్‌ లుక్

టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ హనుమాన్‌. ప్రశాంత్‌వర్మ డైర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సినీ ప్రేక్షుల్లో మంచి అంచణాలే ఏర్పడ్డాయి. హనుమాన్ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్‌, పాటలు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. ఇక, తాజాగా ఈ మూవీ నుంచి కొత్త అప్‌డేట్ అందించారు మేకర్స్‌. నవంబర్ 28న (రేపు) 4:05 గంటలకు ‘ఆవకాయ ఆంజనేయ’ అనే సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

ఇక, ఈ మూవీని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. హనుమాన్‌లో కోలీవుడ్ భామ అమృతా అయ్యర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోడగా.. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement