Friday, April 26, 2024

వృత్తి నిపుణులకు హెచ్‌1బి వీసా ప్రక్రియ.. మార్చి 1నుంచి ప్రారంభం

2024 ఏడాదికి సంబంధించి నైపుణ్యం కలిగిన నిపుణులకు హెచ్‌-1బి వీసాల కోసం మార్చి 1 నుండి మార్చి 17 వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది. ఆసక్తిగల పిటిషనర్లు, ప్రతినిధులు హెచ్‌1బి రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్‌లో పూర్తిచేయాలని సూచించింది. యూఎస్‌సీఐఎస్‌ 2024 హెచ్‌1బి క్యాప్‌ కోసం సమర్పించిన ప్రతి రిజిస్ట్రేషన్‌కు నిర్ధారణ నంబర్‌ను కేటాయిస్తుంది. ఇది రిజిస్ట్రేషన్‌లను ట్రాక్‌ చేయడానికి ఉపయోగించ బడుతుంది.

- Advertisement -

అయితే, కేస్‌ స్టేటస్‌ ఆన్‌లైన్‌లో ఒకరి కేసు స్థితిని ట్రాక్‌ చేయడానికి నంబర్‌ ఉపయోగించబడదని యూఎస్‌సీఐఎస్‌ ఒక విడుదలలో తెలిపింది. హెచ్‌1బి క్యాప్‌-సబ్జెక్ట్‌ పిటిషనర్లందరూ ఎంపిక ప్రక్రియ కోసం ప్రతి లబ్ధిదారుని ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో నమోదు చేసుకోవడానికి యూస్‌సిఐఎస్‌ ఆన్‌లైన్‌ ఖాతాను ఉపయోగించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి రిజిస్ట్రేషన్‌కు 10 డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

రిజిస్ట్రెంట్‌లు, అంటే, యూఎస్‌ యజమానులు, ఏజెంట్‌లు రిజిస్ట్రెంట్‌ ఖాతాను ఉపయోగిస్తారు. వారు ఫిబ్రవరి 21 నుండి కొత్త ఖాతాలను సృష్టించడానికి వీలుంటుంది. ప్రతినిధులు ఎప్పుడైనా తమ ఖాతాలకు క్లయింట్‌లను జోడించవచ్చు. అయితే లబ్ధిదారుల సమాచారాన్ని నమోదు చేయడానికి, 10 డాలర్ల రుసుముతో రిజిస్ట్రేషన్‌ను సమర్పించడానికి మార్చి 1 వరకు వేచి ఉండాలి అని యూఎస్‌సిఐసి ప్రకటన పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement