Sunday, April 28, 2024

స్టార్ హీరోతో గుత్తా జ్వాల పెళ్లి ఖరారు

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. కొన్ని నెలలుగా కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్న జ్వాల ఆయనతో పెళ్లికి సిద్ధమైంది. త్వరలో తాము మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ అధికారికంగా ప్రకటించాడు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకున్న జ్వాల-విష్ణు త్వరలో వివాహ బంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. కాగా ఇరువురికి ఇది రెండో వివాహమే.

బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో పెళ్లాడిన గుత్తా జ్వాల ఆ తర్వాత 2011లో విడాకులు తీసుకుంది. మరోవైపు 2010లో రజనీ నటరాజ్‌ని వివాహమాడిన విష్ణు విశాల్‌.. 2018లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. త్వరలో పెళ్లి తేదీని వెల్లడిస్తామని, తెలుగు ఇంటి అల్లుడిని కాబోతున్నందుకు ఆనందంగా ఉందని విష్ణువిశాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement