Friday, April 26, 2024

ఓరి దేవుడా నుండి గుండెలోనా సాంగ్ ను రిలీజ్ చేయ‌నున్న మేక‌ర్స్

అర‌డ‌జ‌ను చిత్రాల‌ను సెట్స్ పై ఉంచాడు హీరో విశ్వ‌క్ సేన్. అందులో ‘ఓరి దేవుడా’ మూవీ ఒకటి. త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన ‘ఓమై క‌డువ‌లే’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కింది. ఒరిజ‌నల్ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన అశ్వత్ మ‌రిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెర‌కెక్కిస్తున్నాడు. వెంకటేష్ ఈ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్‌కు జోడీగా మిథిలా పాల్కర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని పీవిపీ సినిమాస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. లియన్‌ జేమ్స్‌ సంగీతం అందిస్తున్నాడు. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్‌ 21న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ మరో క్రేజీ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.ఈ సినిమాలోని ‘గుండెలోనా’ అంటూ సాగే మెలోడియస్‌ పాటను మంగళవారం సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. లైఫ్‌ మనకు ఇంకొక చాన్స్ ఇస్తే.. గతంలో మనం తీసుకున్న నిర్ణయాలను మార్చుకోగలిగితే జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement