Sunday, April 21, 2024

Holidays | విద్యార్థులకు గుడ్ న్యూస్.. మహాశివరాత్రికి మూడు రోజుల సెలవు

విద్యార్థులకు ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులు సెలవులను ప్రకటించాయి. మహాశివరాత్రి మార్చి8వ తేదీన వస్తోంది. అయితే మహాశివరాత్రిని ప్రతీ సంవత్సరం మూడు రోజులు జరుపుకుంటారు. అయితే ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు మొదటి రోజు మాత్రమే శివరాత్రి సందర్భంగా హాలిడే ను ప్రకటిస్తాయి. కానీ ఈ సారి మూడు రోజులు వరుస సెలవులను ప్రకటించారు.

మార్చి 8 వ తేదీ ఒక్కరోజు సెలవు ప్రకటించినా.. ఆ రోజు శుక్రవారం కావడం.. మరుసటి రోజు సెకండ్ శనివారం, తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలువులు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ మూడు రోజులు సెలవులను మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో వీటితో పాటు మార్చి నెలలో మరో రెండు రోజులు సెలవులు కూడా రానున్నాయి. మార్చి 25న హోలీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా సలవులను ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement