Wednesday, May 15, 2024

Yuvika 2024 | విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. యువ శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు ఇస్రో సంకల్పం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) యువ శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యువ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంగా యువిక-2024 (యూత్ సైన్స్ ప్రోగ్రామ్)ను ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ నెల 20 నుంచి మార్చి 20 వరకు www.isro.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మార్చి 28న తొలి జాబితాను, ఏప్రిల్ 4న రెండో జాబితాను ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. యువిక 2024 తో 9వ తరగతి విద్యార్థులు భారతదేశంలోని అనేక అంతరిక్ష కేంద్రాలను సందర్శించి వాటి గురించి తెలుసుకునే అవ‌కాశం కల్పిస్తుంది ఇస్రో.

ఎంపికైన విద్యార్థులకు విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌ (తిరువనంతపురం), యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ (బెంగళూరు), స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (అహ్మదాబాద్‌), నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (హైదరాబాద్‌), నార్త్‌ ఈస్ట్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (షిల్లాంగ్‌), ఐఐఆర్‌ఎస్‌ (డెహ్రాడూన్‌), శ్రీహరికోట అంతరిక్ష కేంద్రాలలో మే 16 నుంచి 28 వరకు 13 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement