Saturday, June 22, 2024

మెట్రో ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌… మెట్రో స‌ర్వీసుల స‌మ‌యం పెంపు..

న‌గ‌ర వాసుల‌కు హెచ్ఎంఆర్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌స్తుతం రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు మెట్రో సర్వీస్సే వ‌లు అందిస్తుండ‌గా.. తాజాగా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్ధం మెట్రో రైల్ సమయం పెంచుతూ హెచ్ఎంఆర్ నిర్ణయం తీసుకుంది. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ సందర్భంగా మెట్రో సమయం పెంపుకు నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. మియాపూర్ – ఎల్బీనగర్, నాగోల్ – రాయదుర్గం రూట్లలో అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. రద్దీ దృష్ట్యా గాంధీభవన్ మెట్రోస్టేషన్లో 6 టికెట్ కౌంటర్లను పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement