Friday, June 2, 2023

మ‌రోసారి ఆనం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏడాదిలోపు ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడంలేదని మండిపడ్డారు ఆనం. కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారన్నారు. అధికారులను అడిగితే త్వరలో పూర్తి చేస్తామని చెబుతున్నారని.. అవి పూర్తయ్యే లోపు తమ పదవి కాలం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement