Monday, May 6, 2024

ఏపీలో కాంట్రాక్ట్ లెక్చరర్లకు తీపి కబురు

కాంట్రాక్టు లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న 719 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

జూన్ 2021 నుంచి ఓ పది రోజుల పాటు కాంట్రాక్టు లెక్చరర్ల సేవలకు విరామం ఉంటుందని ఏపీ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. ఏపీ సర్కార్ తాజాగా నిర్ణయం పట్ల కాంట్రాక్టు లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మూతపడ్డ స్కూళ్లను ఆగస్టు 16 నుంచి పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. కాలేజీల విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో ఇద్దరు ఐఏఎస్‌లపై అరెస్ట్ వారెంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement