Monday, April 29, 2024

వైర‌ల్ అవుతోన్న – బిల్ గేట్స్ రెజ్యూమ్

ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌రైన ..మైక్రోసాప్ట్ వ్య‌వ‌స్థాప‌కులు బిల్ గేట్స్ రెజ్యూమ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 48 ఏళ్ల క్రితం నాటి తన రెజ్యూమ్ ను స్వయంగా బిల్ గేట్స్ ‘లింక్డ్ ఇన్’లో షేర్ చేశారు. ‘ మీరు ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండొచ్చు. లేదా కాలేజీ డ్రాపవుట్స్ కావచ్చు. 48 ఏళ్ల క్రితం నాటి నా రెజ్యూమ్ కంటే మీ రెజ్యూమ్ మెరుగ్గా ఉంటుందని నేను కచ్చితంగా చెప్పగలను అని బిల్ గేట్స్ పోస్ట్ పెట్టారు.ఈ రెజ్యూమ్ రూపొందించుకునే నాటికి బిల్ గేట్స్ హార్వర్డ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కోర్సులో ఉన్నారు. రెజ్యూమ్ ను పరిశీలిస్తే అందులో బిల్ గేట్స్ చేసిన కోర్సుల వివరాలు కనిపిస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్స్ స్ట్రక్చర్, డేటా బేస్ మేనేజ్ మెంట్, కంపైలర్ కన్ స్ట్రక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్సులు చేసినట్టుగా అందులో ఉంది. బిల్ గేట్స్ పూర్తి పేరు అయిన విలియం హెన్రీ గేట్స్ కూడా కనిపిస్తుంది. దీనికి నెటిజన్ల నుంచి స్పందన అమితంగా వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement