Sunday, April 28, 2024

Benglore: బాయ్‌ఫ్రెండ్ ఫోన్ చూసి గ‌ర్ల్ ఫ్రెండ్ షాక్‌….. 13000 న్యూడ్ ఫోటోలు

భాయ్‌ఫ్రెండ్ ఫోన్ చూసి గ‌ర్ట్ ఫ్రెండ్ కంగుతిన్నది. బాయ్‌ఫ్రెండ్ ఫోన్‌లో 13000 అశ్లీల ఫోటోలు గుర్తించిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది.

ఓ యువతి బిపిఒ సంస్థలో పని చేస్తుంది. అదే కంపెనీలోని అదిత్య సంతోష్ అనే యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తోంది. అతడితో చనువుగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసినప్పుడు తొలగించాలని చెప్పగానే డిలీట్ చేశాడు. సంతోష్ ఫోన్ తీసుకొని ఫోటో గ్యాలరీ ఓపెన్ చేయగానే 13000 వేల అశ్లీల ఫోటోలు కనిపించాయి. ఆ గ్యాలరీలో బిపిఒలో పని చేసే యువతుల ఫొటోలతో పాటు తన ఫొటోలు ఉండడంతో ఆమె షాక్‌కు గురైంది. వెంటనే తేరుకొని బిపిసి సంస్థ హెచ్‌ఆర్, మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement