Friday, May 3, 2024

Gift City – గాంధీ పుట్టిన రాష్ట్రంలో మద్యానికి గ్రీన్ సిగ్నల్

మద్య నిషేధం అమలౌతున్న రాష్ట్రాల్లో ఒకటైన గుజరాత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గిఫ్ట్‌ సిటీగా పిలిచే గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌ సిటీలో మద్యానికి అనుమతి ఇచ్చింది..

1960లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గుజరాత్‌లో మద్య నిషేధం అమలౌతోంది. మహాత్మ గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా దాదాపు 60 ఏళ్లుగా ఇక్కడ మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉంది. తాజాగా ఆ నిబంధనను సడలించింది. గాంధీనగర్‌లో ఏర్పాటైన గిఫ్ట్‌ సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ఆల్కహాల్‌ సేవనానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.

గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌, ఆప్‌ భగ్గుమన్నాయి. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ఎత్తివేయడానికే తొలుత గిఫ్ట్‌సిటీని ఎంచుకున్నారంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల యువత మద్యానికి బానిసలుగా మారే అవకాశం ఉందని, నేరాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేసింది. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆప్‌ డిమాండ్‌ చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement