Thursday, April 25, 2024

రావ‌ణాసుర గ్లింప్స్.. ఎప్పుడంటే

జ‌న‌వ‌రి 26న రావణాసుర గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేయనున్నట్టు ఓ వీడియో ద్వారా తెలియజేశారు మేక‌ర్స్. రావణాసురలో హీరోగా మాస్ మ‌హారాజ ర‌వితేజ న‌టిస్తున్నారు. అనూ ఎమ్మాన్యుయేల్‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌ ఫీ మేల్‌ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో యువ నటుడు సుశాంత్‌ విలన్‌గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, నితిన్‌ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. రావణాసుర చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్‌- భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. యూనిక్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధీర్‌ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో రవితేజ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ అందించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement