Monday, May 20, 2024

గంజాయి స్మగ్లర్ల అరెస్టు… 200 కేజీల గంజాయి స్వాధీనం

కార్వాన్‌, ప్రభన్యూస్‌ : హైద్రాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం, లంగర్‌హౌస్‌ పోలీసులతో కలిసి లంగర్‌హౌస్‌ స్టేషన్‌ పరిధిలోని అత్తాపూర్‌ ప్రాంతంలో నిషేదిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఎపి05 టిఎన్‌ 1503 ఐషర్‌ డిసీయం వ్యాన్‌, 200కేజీల గంజాయి, 3 మొబైల్స్‌ స్వాదీనం చేసుకుని, ఇద్దరు సరఫరాదారులు, 1 డ్రగ్‌ పెడ్లర్‌ అదుపులోకి తీసుకున్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన నిందితుల వివరాలు.. డ్రైవర్‌ శ్రీనివాస్‌, క్లీనర్‌ ఎ.సత్తి బాబుజీవనోపాధి పొందుతున్న తరుణంలో ఇద్దరు వ్యక్తలు సిలేరుకు చేందిన నాగేష్‌, పాండు కలసి గంజాయిని రాజమండ్రి నుండి హైద్రాబాద్‌కు రవాణ చేస్తే లక్ష 20 వేల రూపాయలు అందించే విదంగా బేరం కుదుర్చుకుని, డ్రైవర్‌ క్యాబిన్‌ పైబాగంలో ఓ పెట్టెను ఏర్పాటు చేసే విధంగా సవరించి నిందితులు ఇచ్చిన బాక్సును అందులో ఉంచారన్నారు.

- Advertisement -

విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించడం జరిగిందన్నారు. సరఫరాదారు1) సి.శ్రీనివాస్‌ 48, వృత్తి ఐషర్‌ డిసీయం డ్రైవర్‌, నివాసం మోరంపూడి, రాజమండ్రి, తూ.గోదావరి,ఎపీ, సరఫరాదారు 2) ఎ.సత్తి బాబు 29,వృత్తి ఐషర్‌ డిసీయం క్లీనర్‌, నివాసం మోరంపూడి, రాజమండ్రి, తూ.గోదావరి,ఎపీ, 3) డ్రగ్‌ పెడ్లర్‌ మొహ్మద్‌ హబీబ్‌ 35,వృత్తి క్యాబ్‌ డ్రైవర్‌, నివాసం రాజేంద్రనగర్‌ అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసి విచారణ కోనసాగిస్తున్నామన్నారు.

పరారీలో గల నిందితుల వివరాలు 1) పర్వేజ్‌ 40,ఆసిఫ్‌ నగర్‌,జిర్రా, హైద్రాబాద్‌, 2) జావిద్‌,నివాసం చంద్రాయిన్‌ గుట్టా,3) మంగేష్‌, నివాసం ఉస్మానాబాద్‌, మహారాష్ట్రం, 4)నాగేష్‌, నివాసం సిలేరు, ఎపీ,5) పాండు,నివాసం సిలేరు,ఎపీ వారికోసం గాలిపుకోనసాగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నార్కోటెక్‌ ఎన్ఫోర్సుమెంట్‌ వింగ్‌ డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఇన్స్‌ పెక్టర్‌ రాజేష్‌, ఎస్‌ఐ డానియల్‌ శింతా కుమారీ, లంగర్‌ హౌస్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాస్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement