Wednesday, May 1, 2024

కేన్ అనే నేను …. నా కర్తవ్యాన్ని శ్రద్ధతో , అంతఃకరణశుద్ధి తో నిర్వహిస్తా…

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇక సన్ రైజర్స్ మ్యాచ్ ఏప్రిల్ 11న జరగబోతోంది. మొదటి మ్యాచ్ కోల్ కత్తా తో సన్రైజర్స్ తలపడనుంది. ఇదిలా ఉండగా ఆరంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు .

తాజాగా న్యూజిలాండ్ బ్యాట్స్ మ్యాన్ కేన్ విలియమ్సన్ పై సన్ రైజర్స్ ఓ ఫోటోను పోస్ట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాలోని గెటప్ అది. కేన్ అనే నేను …. నా కర్తవ్యాన్ని శ్రద్ధతో , అంతఃకరణశుద్ధి తో నిర్వహిస్తా అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement