Monday, April 29, 2024

నిండు గర్భంతో పూర్ణ‌ స్టెప్పులు.. మండిపడిన నెటిజన్స్

న‌టి పూర్ణ మ‌రికొన్ని రోజుల్లో డెలివ‌రీ కానున్నారు. కాగా నెలలు నిండిన పూర్ణ పాటకు డాన్స్ చేసి విమర్శలు పాలైంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన దసరా మూవీలో పూర్ణ వదినమ్మ పాత్ర చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్-నాని మీద తెరకెక్కిన చమ్కీల అంగీలేసి సాంగ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఆ పాటకు పూర్ణ డాన్స్ చేశారు. ఆ వీడియో చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.నిండు గర్భంతో డాన్స్ చేస్తావా ఈ సమయంలో అలాంటి పనులు చేయకూడదని తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పూర్ణ తీరు విమర్శల పాలయింది. నిజంగా అది అత్యంత ప్రమాదం. ఆవిడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి వీడియోల కోసం తాపత్రయ పడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యంగా బిడ్డను కని బయటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బుల్లితెర మీద సందడి చేస్తున్నారు. కామెడీ, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement