Friday, May 10, 2024

ఈ నెల 26 నుంచి – నెట్ ప్లిక్స్ లో అనేక్ మూవీ

నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అనేక్ చిత్రం. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం ‘అనేక్’ ఇటీవల విడుదలైంది. అయితే, ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో డైరెక్టర్..ఈశాన్య రాష్ట్రాల సమస్యపైన చర్చించారు. ఆర్మీ ఆఫీసర్ గా ఆయుష్మాన్ ఖురానా నటించారు.

ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న వేర్పాటు వాద సమస్యలను పరిష్కరించేందుకు ఆఫీసర్ గా ఆయుష్మాన్ ఖురానా చక్కటి నటన కనబర్చారు. అనుభవ్ సిన్హా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనేక్ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయలేకపోయింది. ఇందులో టాలీవుడ్ ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి నటించారు. తాజాగా ఈ సినిమా OTT స్ట్రీమింగ్ గురించి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 26 నుంచి ‘అనేక్’ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement