Sunday, April 28, 2024

ఆగ‌స్టు 31 నుంచి ఆసియా క‌ప్‌.. పాక్‌, శ్రీ‌లంక‌లో మ్యాచ్‌లు

ఆసియా కప్ 2023కి రంగం సిద్ధమైంది. ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ 17 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఆరు దేశాలు పాల్గొనే ఈ మినీ టోర్నమెంట్‌కు పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించింది. స్టార్ స్పోర్ట్స్ ఈ టోర్నీ ప్రసార హక్కులను పొందింది. ఆసియా కప్ థీమ్‌ను తెలుపుతూ స్టార్ స్పోర్ట్స్ వీడియో ప్రోమోను విడుదల చేసింది. ఇప్పుడు అది వైరల్‌గా మారింది.

వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ టోర్నీకి ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌కు ఉండగా, అక్కడికి వెళ్లేందుకు బీసీసీఐ నిరాకరించింది. భద్రతా కారణాలతో పాటు, ప్రభుత్వ అనుమతి సమస్యగా తెలుస్తోంది. దాంతో పీసీబీ హైబ్రిడ్ మోడల్‌ను ప్రవేశపెట్టింది.

భారతదేశం మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి.. మిగిలిన మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరుగుతాయి. అయితే ఈ ప్రతిపాదనను బంగ్లాదేశ్, శ్రీలంక వ్యతిరేకించాయి. దుబాయ్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లు ఇబ్బంది పడతార‌ని పేర్కొన్నారు. చివరకు బీసీసీఐ జోక్యంతో శ్రీలంకలో 9 మ్యాచ్‌లు, పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు నిర్వహించేందుకు అన్ని దేశాలు అంగీకరించాయి.

గతేడాది జరిగిన ఆసియా కప్ 2022 టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో అద్భుత విజయం సాధించింది. ఆసియా కప్ 2023 ప్రత్యక్ష ప్రసారం డిస్నీ హాట్‌స్టార్‌లో ఉచితంగా చూపబడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement