Tuesday, April 30, 2024

పాలిసెట్‌ – 2023 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ..

అమరావతి,ఆంధ్రప్రభ: అతి పిన్న వయస్సులొ సులువుగా ఉపాధి, ఉద్యొగ అవకాశాలు పొందడానికి ”పాలిటెక్నిక్‌ విద్య” ఉత్తమమైన మార్గమని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. యువతను పాలిటెక్నిక్‌ విద్య వైపు మళ్లించే చర్యలలో భాగంగా అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లలో పాలిసెట్‌ – 2023 కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు. పదవ తరగతి విద్యార్ధులలో అవగాహన కలిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పాలిసెట్‌ తొలివిడద కోచింగ్‌ ప్రక్రియ 17 వ తేదీన ప్రారంభించగా, 24వ తదీ నుండి మరో బ్యాచ్‌ ప్రారంభిస్తున్నామని నాగరాణి వివరించారు. శిక్షణ పొందిన ప్రతి విద్యార్ధికి ఇంగ్లీష్‌, తెలుగు మీడియంలలో ఉచిత స్టడీ మెటీరియల్‌ అందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ ప్రవేశము కోసం మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61 పట్టణాలలోని 410 పరీక్ష కేంద్రములలో పాలీసెట్‌ 2023 నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షకు సుమారు 1,50,000 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే ఓసి, బిసి విద్యార్ధులు రూ.400, ఎస్టి ఎస్సీ విద్యార్ధులు రూ.100 ప్రవేశ రుసుమును దగ్గరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లోగానీ, https:/polycetap.nic.in వెబ్‌ సైట్‌ ద్వారా కానీ ఏప్రిల్‌ 30 సాయంత్రం 5గంటల లోపు చెల్లించాలన్నారు. అర్హులైన ప్రతి విద్యార్ధినికి సంవత్సరమునకు రూ.50,000 చొప్పున మూడు సంవత్సరాల ప్రగతి స్కాలర్‌ షిప్‌ లభిస్తుందన్నారు. జగనన్న విద్యదీవేన, వసతి దీవెన ద్వారా విద్యార్ధులకు పిజు రియంబర్స్మేంట్‌ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పాలి-టె-క్నిక్‌ కోర్సులకు అత్యధిక అర్హతలు, అనుభవము కలిగిన అధ్యాపకులతో విద్యాబోధన సాగుతుందని కమీషనర్‌ స్పష్టం చేసారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement