Sunday, May 19, 2024

18 ఏళ్లు పైబడివారికి ఉచిత బూస్టర్‌ డోస్‌.. రేపటినుంచి మొదలు

దేశంలో18 ఏళ్లు పైబడిన అందరికీ శుక్రవారంనుంచి ఉచిత బూస్టర్‌ డోస్‌ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆజాదీకా అమృత మహోత్సవ్‌ సందర్భంగా రేపటినుంచి 75 రోజులపాటు ఈ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఉచిత బూస్టర్‌ డోస్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. 18-59 ఏళ్ల మధ్య వయస్సున్నవారు దేశంలో 77 కోట్లమంది ఉండగా ఇప్పటివరకు కేవలం 1 శాతం మంది మాత్రమే బూస్టర్‌ డోస్‌ వేయించుకోగలిగారు. మరోవైపు 60 ఏళ్ల పైబడిన వారు దేశంలో 16 కోలమంది ఉండగా దాదాపు 26 శాతంమంది, కరోనాపై పోరాడంలో ముందువరుసలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్యసిబ్బంది ఇప్పటికే బూస్టర్‌ డోస్‌ వేయించుకున్నారు. దేశపౌరుల్లో అత్యధికమంది రెండో డోస్‌ వ్యాక్సిన్‌ను దాదాపు 9నెలల కిందట వేసుకున్నారు.

తొలి రొండు డోస్‌ల వ్యాక్సినేషన్‌ చేయించుకున్నవారిలో దాదాపు ఆరునెలలపాటు యాంటీబాడీస్‌ ఉంటాయని, అందువల్ల వెంటనే బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాల్సి ఉంటుందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఐసీఎంఆర్‌, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువమందికి ఉచిత బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. రెండో డోస్‌ టీకాకు బూస్టర్‌ డోస్‌కు మధ్య ఉండే కాల వ్యవధిని 9 నెలలనుంచి 6 నెలలకు కుదిస్తూ ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆప్‌ ఇన్యునైజేషన్‌ సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా హర్‌ ఘర్‌ దస్టక్‌ కేంపెయన్‌ 2 కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి టీకాలు ఇచ్చే కార్యక్రమం జులై 1న ప్రారంభం కాగా రెండు నెలలపాటు కొనసాగిస్తారు. దేశపౌరుల్లో 96 శాతం మంది తొలిడోస్‌ను, 87 శాతంమంది రెండో డోస్‌ను తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement