Monday, April 29, 2024

ఇండియాలో ఫాక్స్‌కాన్‌ ఈవీ కార్ల ప్లాంట్‌

మన దేశంలో ఫాక్స్‌కాన్‌ చిన్న విద్యుత్‌ కార్లను తయారు చేయాలన్న ఆలోచనలో ఉంది. తైవాన్‌తో పాటు, ఇండియాలోనూ ప్లాంట్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. ఫాక్స్‌కాన్‌ అనుబంధ సంస్థ ఈవీ వాహనాలను తయారు చేసే మొబిలిటీ ఇన్‌ హర్మనీ (ఎంఐహెచ్‌) సీఈఓ జాక్‌ ఛాంగ్‌ ఈ వివరాలను వెల్లడించారు. మాతృసంస్థ ఫాక్స్‌కాన్‌తో కాని, మరో సంస్థతోకాని ఈవీ చిన్న కార్లను తయారు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 20వేల డాలర్లలోపు విలువైన త్రీ సీటర్‌ విద్యుత్‌ కార్లను తయారు చేయాలని భావిస్తున్నట్లు ఆయన రాయటర్స్‌తో చెప్పారు. ఈ కొత్త ఈవీ కారు కార్పోరేట్‌ డెలివరీ ప్లీట్‌కు అనుగుణంగ తయారు చేయనున్నామని చాంగ్‌ తెలిపారు.

గత సంవత్సరం అక్టోబర్‌లో కంపెనీ ఈ కారు మోడల్‌ను జపాన్‌లోజరిగిన ఆటో ప్రదర్శనలో ప్రదర్శించింది. వీటి ఆర్డర్ల కోసం కంపెనీ ఇప్పటికే స్టోర్స్‌, కారు రెంటల్‌ కంపెనీలతోనూ, కొరియర్‌ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఇండియా, థాయిలాండ్‌ రెండూ కొత్త ఈవీ కారు ఉత్పత్తికి కేంద్రలుగా ఉండే అవకాశం ఉందన్నారు. ఇండియా మార్కెట్‌ దీర్ఘకాల వృద్ధికి తమకు ముఖ్యమైన మార్కెట్‌ అని చెప్పారు.

ఇండియా, దక్షిణాసియా మార్కెట్లలో భారీగా అమ్మకాలకు అవకాశం ఉందని చాంగ్‌ చెప్పారు. ఇండియా వచ్చే తరానికి అభివృద్ధి చెందుతున్న శక్తి అని ఆయన అభివర్ణించారు. రానున్న 18-24 నెలల కాలంలో ఈవీ కార్ల ఉత్పత్తిని ప్రారంభించాలని ఎంఐహెచ్‌ కంపెనీ భావిస్తోంది. 6 సీట్లు ఉన్న ఈవీ కారు 2024లో, 9 సీట్లు మోడల్‌ను 2025లో మార్కెట్‌లోకి తీసుకు వస్తామని చాంగ్‌ వెల్లడించారు. 2025 నాటికి మొత్తం ప్రపంచ ఈవీ మార్కెట్‌లో 5 శాతం వాటా సాధించాలని ఫాక్స్‌కాన్‌ లక్ష్యాంగా పెట్టుకుంది. ఎంఐహెచ్‌ కంపెనీ అమ్మకాలు కూడా ఫాక్స్‌కాన్‌ టార్గెట్‌లో భాగమే.

టెస్లా షాంఘై ప్లాంట్‌ గురించి ప్రస్తావనపై స్పందించిన చాంగ్‌, తాము ఇండియాలో తాము మరో షాంఘైని నిర్మిస్తామని చెప్పారు. తాము ఫాక్స్‌కాన్‌ ఇండియా ప్లాంట్‌లోనే ఈవీ కార్ల ఉత్పత్తిని చేస్తామన్నారు. పూర్తిగా ఇండియా ప్లాంట్‌గానే ఉంటుందన్నారు. ఇండియా ప్లాంట్‌తో తాము మరింత గట్టిపోటీ ఇస్తామన్నారు. ఫాక్స్‌కాన్‌ అనుబంధ ఎంఐహెచ్‌ కంపెనీ తయారు చేసే ఈవీ కార్లలో గూగుల్‌, అండ్రాయిడ్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను డెవలప్‌ చెసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో 2,600 మంది సప్లయిర్స్‌ను జాబితాలో ఫాక్స్‌కాన్‌ చేర్చుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement