Friday, May 17, 2024

Festival Offer – ద‌స‌రాకు ముందే కొత్త సినిమాల టీజ‌ర్ల సంద‌డి…

దసరా పండుగ సీజన్‌లో టాలీవుడ్ అగ్ర తారలు, దర్శకులు బాక్సాఫీస్ వద్ద హోరెత్తించే సినిమాలతో రెడీగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా.. సోష‌ల్ మీడియా వేధిక‌గా ఆయా సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లతో అభిమానులు, సినీ ప్రేమికులకు మినీ ట్రీట్ ఇస్తున్నారు.

కాగా, ఈ దసరాకి టాలీవుడ్ నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాలుగు పెద్ద సినిమాల టీజ‌ర్ లు వ‌రుస పెట్టి రిలీజ్ కానున్నాయి. నాని,మృణాల్ ఠాకూర్‌ల ‘హాయ్ నాన్న’, వెంకటేష్‌ల ‘సైంధవ్’, నితిన్,శ్రీలీల ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాల టీజ‌ర్ ల‌తో హల్ చల్ చేయనున్నారు.

అక్టోబరు 15న హాయ్ నాన్న టీజర్, అక్టోబర్ 16న సైంధవ్ టీజర్ విడుదల కానున్నాయి. దీని తర్వాత అక్టోబర్ 17న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్ లాంచ్ చేయ‌నుండ‌గా.. ఆఖరికి అక్టోబర్ 18న ఫ్యామిలీ స్టార్ టీజర్‌ను విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement