Friday, May 3, 2024

National – బెంగుళూరులోని రెస్టారెంట్ లో భారీ పేలుడు..న‌లుగురికి గాయాలు..

బెంగుళూరు లోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు గాయ‌ప‌డ్డారు.. నేటి మ‌ధ్యాహ్నం ఈ పేలుడు జ‌రిగింది.. గాయపడిన వారిలో ముగ్గురు సిబ్బంది ఉండగా..మ‌రోకరు కస్టమర్. వారిని చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. ప్రాథమిక నివేదిక ప్రకారం బ్యాగులో ఉంచిన వస్తువు పేలింది. పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. పేలుడు వార్త తెలియగానే వైట్‌ఫీల్డ్ ఏరియా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంఘటన స్థలానికి చేరుకుని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement