Sunday, May 5, 2024

KCR: రంగంలోకి కేసిఆర్… నల్గొండలో బహిరంగ సభ…

మాజీ సీఎం కేసీఆర్‌ రణరంగంలోకి దూకుతున్నారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్న కేసీఆర్‌… ఇప్పుడు నేరుగా ప్రజల మధ్యకు వచ్చేందుకు రెడీ అయ్యారు.నల్గొండ జిల్లాలో ఇవాళ బీఆర్‌ఎస్‌ నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొంటారు.

- Advertisement -

సభకు హెలికాప్టర్ లో రానున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్‌ నేరుగా ప్రజల వద్దకు రావడం ఇదే తొలిసారి. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఈ మీటింగ్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తమ అభిమాన నాయకుడి స్పీచ్‌ వినేందుకు గులాబీ కార్యకర్తలు నల్గొండకు క్యూ కట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement