Sunday, May 5, 2024

మహీంద్రా నుంచి ఐదు ఈవీ కార్లు.. అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి

ప్రముఖ భారతీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా 2026 అక్టోబర్ నాటికి ఐదు బోర్న్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ కాన్సెప్ట్ కార్లను యునైటెడ్ కింగ్‌డమ్‌లో గత ఏడాది ఆగస్టు 15వ తేదీన ప్రదర్శించింది. కాగా, మహీంద్రా త్వరలో తీసుకువచ్చే ఎలక్ట్రిక్ కార్లు, అవి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం..

మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ8

ఈ XUV.e8 ఎలక్ట్రిక్ SUV కారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మహీంద్రా XUV700 కి ఎలక్ట్రిక్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. దీని పొడవు 45 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 10 మిల్లీమీటర్లుగా ఉంది. వీల్‌బేస్ 7 మిల్లీమీటర్ల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. XUV.e8 మూడు-వరుసల సీటింగ్, 80 kWh బ్యాటరీ ప్యాక్ తో మొత్తం శక్తికి 230-350 HP అందిస్తుంది. దీనిని 2024 డిసెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9

ఏప్రిల్ 2025 నాటికి, మహీంద్రా XUV.e9 డీలర్‌షిప్‌లలో ఉండవచ్చు. 2021 మే నెలలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700కు సంబంధించిన కూపే వెర్షన్ లాగా వ‌చ్చే చాన్స్ ఉంది. అయితే దీని బాడీ స్టైల్ డిఫరెంట్‌గా ఉండనుంది. పవర్‌ట్రెయిన్ XUV.e8 SUVతో భాగస్వామ్యం చేయబడుతుందని భావిస్తున్నారు.

మహీంద్రా బీఈ.05

మహీంద్రా రానున్న మ‌రో ఈవీ కారు మహీంద్రా BE.05. ఇది అక్టోబర్ 2025 నాటికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కారు టెస్టింగ్ దశలో ఉంది. ఇది 4.3మీటర్ల పొడవును కొలుస్తుంది, ఇది టాటా కర్వ్‌తో పోటీపడుతుంది.

మహీంద్రా బీఈ రోల్-ఈ

మహీంద్రా BE రాల్-E అనేది BE.05 SUV ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ వెర్షన్. రోల్-ఈ ఎస్‌యూవీ బాడీ క్లాడింగ్, రీప్రొఫైల్డ్ ఫ్రంట్, రియర్ బంపర్‌లు, మందపాటి ఆఫ్ రోడ్ టైర్లు, స్పేర్ టైర్ రూఫ్ మౌంటెడ్ క్యారియర్‌ తో రానుంది. ఇది BE.05తో పాటు ఇది కూడా 2025 అక్టోబర్లో లాంచ్ కానుందని అంచనా.

మహీంద్రా బీఈ.07

చివరగా, మహీంద్రా BE.07 ఉంది. ఇది అక్టోబర్ 2026 నాటికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. XUV700 ఆధారంగా, వెనుక చక్రాల వెనుక అదనపు పొడవు జోడించబడుతుంది. మహీంద్రా BE.07 పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, తో పాటు.. లోపలి భాగంలో.. డ్యాష్‌బోర్డ్‌పై పెద్ద టచ్‌స్క్రీన్ తో పాటు.. హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ఎలిమెంట్‌లతో బటన్-లెస్ డిజైన్‌తో కూడిన కొత్త ఇంటీరియర్ ని అంధిచనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement