Tuesday, May 21, 2024

First Phase – ముగిసిన తొలి ద‌శ ఎన్నికల ప్ర‌చారం … 19న జరగనున్న పోలింగ్

17 రాష్ట్రాలు,నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల‌లోని
107 స్థానాల‌కు 19న పోలింగ్

న్యూ ఢిల్లీ – దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 19న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో, ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగిసింది.

- Advertisement -

అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, తమిళనాడు, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, ఉత్తరప్రదేశ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు… కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఎల్లుండి పోలింగ్ నిర్వహించనున్నారు.

కాగా, తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలకు తొలి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్ లో 12 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement