Thursday, April 25, 2024

పాన్ ఇండియా మూవీ లిల్లీ.. ట్రైల‌ర్ రిలీజ్

శివ‌మ్ డైరెక్ష‌న్ లో మొద‌టిసారిగా చిన్న పిల్ల‌ల‌పై పాన్ ఇండియా మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి లిల్లీ అనే టైటిల్ ని పెట్టారు. లిల్లీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ లాంఛ్ చేశారు. బేబీ నేహా టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది.ఈ చిత్రం లిల్లీ అనే చిన్నారి చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కనున్నట్టు ట్రైలర్‌ తో చెప్పారు దర్శకుడు. చిన్నారులను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్‌ తో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో తెలిసిపోతుంది. ప్రణీతరెడ్డి, వేదాంత్‌ వర్మ, రాజ్‌వీర్‌, మిచెల్లీ షా, రాజీవ్ గోవింద పిళ్లై, శివకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లిల్లీ చిత్రాన్ని గోపురం స్టూడియోస్‌ బ్యానర్‌పై కే బాబు రెడ్డి, జీ సతీశ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement