Thursday, May 2, 2024

Hyderabad: రూబీ హోట‌ల్ ఘ‌ట‌న‌పై ఫైర్ డిపార్ట్‌మెంట్ రిపోర్ట్‌.. సెల్లార్ నుంచే ఎగిసిప‌డ్డ మంట‌లు (వీడియో)

సికింద్రాబాద్‌లో నిన్న (సోమ‌వారం) జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం ఘ‌ట‌న‌పై ఫైర్ డిపార్ట్‌మెంట్ నివేదిక ఇచ్చింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ రూబీ హోట‌ల్ సెల్లార్‌లో ఉంచిన ఎల‌క్ట్రానిక్ బైకుల లీథియం బ్యాట‌రీలతోనే జ‌రిగిన‌ట్టు గుర్తించారు. అక్క‌డ వ‌చ్చిన స్పార్క్‌తో పొగ‌లు వ్యాపించి ఆ త‌ర్వాత మంట‌లు ఎగిసిప‌డ్డాయి.

అట్లా ఈవీల బ్యాట‌రీల‌న్నీ పెద్ద శ‌బ్దంతో పేలిపోతూ మంట‌లు బిల్డింగ్‌లోకి వ్యాపించాయి. అంతేకాకుండా ప‌క్క‌నే ఉన్న సిలిండ‌ర్ల‌కు కూడా మంట‌లంటుకుని పేలిపోయాయి. ఇదంతా బిల్డింగ్ య‌జ‌మాని నిర్ల‌క్ష్యం కార‌ణంగానే జ‌రిగింద‌ని నివేదిక‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని కూడా పోలీసులు రిలీజ్ చేశారు.

వీడియో కోసం www.prabhanews.com లో చూడొచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement