Friday, May 3, 2024

ఎయిమ్స్ లో మరోసారి అగ్నిప్రమాదం..

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్టోర్ రూములో ఈ ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అగ్నిమాపక విభాగం అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్టు ఎయిమ్స్ అధికారులు వెల్లడించారు. కాగా ఎయిమ్స్ ఈ నెల 16 న ఎయిమ్స్ ప్రధాన భవనంలోని 9 వ అంతస్థులో భారీగా మంటలు చెలరేగాయి. డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌లు, పరీక్షా విభాగాలు ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement