Thursday, April 25, 2024

Ireland : ఐర్లాండ్ ప్ర‌ధానిగా మ‌నోడే …ఎంపిక చేసిన అధికార పార్టీ ఫైన్ గేల్…

భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ఇప్పుడు ఐర్లాండ్ దేశానికి ప్రధానిగా ఎంపికయ్యారు. ఇప్పటికే బ్రిటన్ సహా పలు దేశాల్లో కీలక పదవుల్లో ఉన్న భారతీయులు ఇప్పుడు ఐర్లాండ్ లో కూడా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో సైమన్ హ‌రీస్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. లియో వరద్కర్ రాజీనామా తర్వాత, 37 ఏళ్ల యువ నేతకు బాధ్యతలు అప్పగించారు. పాలించే ఫైన్ గేల్ పార్టీకి కొత్త నాయకుడిగా ఎన్నికైన తర్వాత హారిస్ ఇప్పుడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా అవతరించారు.

లియో వరద్కర్ స్థానంలో పార్టీ నాయకుడిగా నియమితులవడం తన జీవితంలో గొప్ప గౌరవమని సైమ‌న్ హ‌రీస్ నేడు జ‌రిగిన మీడియా స‌మావేశంలో అన్నారు. తనను ఎన్నుకున్న వారికి హారిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. మీ నమ్మకాన్ని తిరిగి చెల్లిస్తానని అన్నారు.

ఇక సైమ‌న్ హరీస్ పూర్వికులు ఇండియా నుంచి ఐర్లాండ్ కు వ‌ల‌స వెళ్లారు.. అక్క‌డే వారు స్థిర నివాసం ఏర్ప‌రుచుకున్నారు.. 1986 లో అక్క‌డే హ‌రీస్ జ‌న్మించారు.. అక్క‌డ అధికార పార్టీ పైన్ గేల్ యువజన విభాగంలో కీల‌క నేత‌. చిన్న వయస్సు నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు. పార్టీలో వివిధ పాత్రలు పోషించారు. హారిస్ 2016 నుంచి 2020 మధ్యకాలం వరకు ఐర్లాండ్ ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. కరోనా మహమ్మారి సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఉన్నత విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రశంసలు దక్కించుకున్నారు. ఆ శాఖ‌ల‌లో అత‌డు చేసిన మంచి ప‌నులు ప్ర‌ధాన మంత్రి పీఠానికి బాట‌లు వేశాయి…

Advertisement

తాజా వార్తలు

Advertisement