Monday, April 29, 2024

ఎట్టకేలకు గ్రూప్‌-2 నోటిఫికేషన్‌.. 783 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నిరుద్యోఠఉలు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెరదించుతూ నిర్ణయం తీసుకుంది. 783 గ్రూప్‌-2 పోస్టులకు తెలంగాణ పబ్లిక్‌ సర్కవీస్‌ కమిషన్‌ గురువారంనాడు నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రూప్స్‌ విభాగంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తికాగా, గ్రూప్‌ -2 నోటిఫికేషన్‌తో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రూప్‌-2 పరిధిలో ప్రస్తుతం 16 రకాల సర్వీస్‌ ఉద్యోగాలున్నాయి. ఈ కేటగిరీలోకి మరో ఆరు కేటగిరీలను చేర్చడంతో పోస్టుల సంఖ్య పెరిగింది. జనవరి 18నుంచి అర్హులైన అభ్యర్ధులనుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులకు ఫిబ్రవరి 16 గడువుగా పేర్కొంది.

రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర…

రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ పరంపర కొనసాగుతోంది. 80032 పోస్టుల భర్తీలో భాగంగా ప్రభుత్వం పలు పోస్టులకు ఆమోదం తెలుపగా అనేక నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పలు శాఖల్లో పోస్టుల భర్తీ నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. నియామక సంస్థలు ఉద్యోగ కల్పనలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే గ్రూప్‌-1 పరీక్షకు సంబంధించి 503 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం మెయిన్స్‌ నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో గురువారంనాడు 783 గ్రూప్‌-2 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో9,168 గ్రూప్‌ 4 పోస్టులకుగానూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. వెల్ఫేర్‌ డిపార్ట్మెంట్లలో 581 వార్డెన్‌ పోస్టుల నియామక నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం వేగంగా కార్యాచరణ చేస్తోంది.

- Advertisement -

వెటర్నరీ సర్జన్‌ 185 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. హార్టికల్చర్‌ డిపార్ట్మెంట్లో 22 ఆఫీసర్‌ పోస్టుల నియామానికి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలకాగా, రాష్ట్రంలో జూనియర్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1392 జూనియర్‌ లక్షరాల పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూనియర్‌ కాలేజీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలో ఉన్న 128 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల నియామకానికి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలై కార్యాచరణ జోరందుకుంది. అగ్రికల్చర్‌ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ల నియామకానికి148 నోటిఫికేషన్‌ విడుదల కాగా, నియామక ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement