Friday, May 17, 2024

రాష్ట్రాల ప్రతిపాదనల మేరకు ఎరువుల సరఫరా.. టీఆర్ఎస్ ఎంపీ నామ ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రతి వ్యవసాయ సీజన్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, వారిచ్చే ప్రతిపాదనల ఆధారంగానే ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు చేస్తామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి భగవంత్ తెలిపారు. ఖమ్మం ఎంపీ (టీఆర్ఎస్) నామ నాగేశ్వర రావు శుక్రవారం సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి ఈ మేరకు ప్రతియేటా ప్రతి సీజన్లో అన్ని రాష్ట్రాలతో సమావేశమవుతామని చెప్పారు. ఎరువుల శాఖ ఇచ్చిన ప్రణాళిక ఆధారంగా ఎరువుల లభ్యతకు అనుగుణంగా సబ్సిడీపై ఎరువులను రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎరువుల సరఫరా పద్దతిని ఆన్లైన్లో పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. మార్కెఫెడ్ వంటి రాష్ట్రాల సంస్థాగత ఏజెన్సీల ద్వారా ఎరువుల సరఫరాను క్రమబద్ధీకరిస్తున్నట్టు వెల్లడించారు. రైల్వే రేక్‌ల ద్వారా ఎరువుల సరఫరాను క్రమబద్ధీకరించేందుకు ఎరువుల తయారీదారులు, దిగుమతిదారులను సమస్యయం చేసుకుంటూ ముందుకుపోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్టు పేర్కొన్నారు .

రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా ఎరువులను సరఫరా చేసేలా చర్యలు తీ సుకుంటున్నట్లు వివరించారు. యూరియా ఇతర ఎరువులకు సంబంధించి డిమాండ్, ఉత్పత్తి మధ్య అంతరాన్ని దిగుమతుల ద్వారా సర్దుబాటు చేస్తున్నట్టు తెలిపారు. 2022 ఖరీఫ్ సీజన్లో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాల నుంచి 179.01 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని గుర్తించామని అన్నారు. తెలంగాణకు 10.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉందని, పంజాబ్‌కు 1430 లక్షల మెట్రిక్ టన్నులు, ఉత్తర ప్రదేశ్‌కు 38.50 లక్షల మెట్రిక్ టన్నులు, గుజరాత్ రాష్ట్రానికి 11.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉందని కేంద్ర మంత్రి వివరించారు. 

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement