Friday, May 3, 2024

బడుగు బలహీన వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాపై తప్పుడు ప్రచారాలు: శ్రీనివాస్ గౌడ్..

ఎల్బీనగర్, ( ప్రభ న్యూస్) : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, గౌడ్ కులస్తుల అభ్యున్నతి కోసం 10కోట్లతో నిరా కేఫ్ లను ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నాగోల్ లోని శుభంగార్డెన్స్ లో ఇవ్వాల (శనివారం) గౌడ విద్యార్థి హాస్టల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ‌చ్చిన‌ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నా ఎదుగుదలను చూసి కొంతమంది తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని, నాపై కేసులు ఎన్ని పెట్టిన ఎదుర్కొంటానని అన్నారు. న్యాయస్థానంపై పూర్తి నమ్మకం నాకు ఉందని.. సరైన సమయంలో ప్రజల వాళ్లకి బుద్ధి చెప్తారని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో చాలా కేసులు నాపై ఉన్నాయని కొంతమంది వ్యక్తులు సామజిక మద్యమంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు తెలిపారు. నేను బలహీన వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నా జాతి నమ్మకానికి మారుపేరు అని అన్ని కులాలకు గౌడ హాస్టల్ లో వసతి కల్పిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా గౌడ హాస్టల్ నూతన అధ్యక్షులు మోతె చక్రవర్తి గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ లింగం గౌడ్, ఉపాధ్యక్షులు అయిలీ వెంకన్న గౌడ్, కార్యవర్గ సభ్యులు బైరు భాస్కర్ గౌడ్, సోమ శైలజ గౌడ్ ఎం అశోక్ గౌడ్, డాక్టర్ ఆర్ స్వప్న గౌడ్, సిద్దు గౌడ్, డాక్టర్ హరికుమార్ గౌడ్, ఎలికట్టే విజయకుమార్ గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్ రాజు గౌడ్ అశోక్ గౌడ్ పి లక్ష్మణ్ గౌడ్ వెంకట నర్సాగౌడ్ బసవరాజ్ గౌడ్, విక్రమ్ గౌడ్ తదితర కార్యవర్గ సభ్యులు పదవి ప్రమాణ స్వీకారాన్ని చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్, గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు కోతి కిషోర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం గౌడ్ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్, పల్లె లక్ష్మణరావు గౌడ్, అఖిల భారత గౌడ సంఘం అధ్యక్షులు కూరెళ్ళ వేములయ్య గౌడ్, బాలగోని బాలరాజ్ గౌడ్, పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, చంద్రయ్య గౌడ్, రాష్ట్ర పబ్లిక్ ప్రాస్కూటర్స్ సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్, గణేష్ గౌడ్ , లక్ష్మణ్ గౌడ్, తదితర గౌడ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement