Tuesday, March 26, 2024

Fake Notes – బాంబు పేల్చిన ఆర్బీఐ – రూ.500నోట్ల‌లో న‌కిలీలే ఎక్కువ‌ట‌…

న్యూఢిల్లీ: రూ.2000 నోట్ల‌తో పోలిస్తే రూ.500 డినామినేష‌న్‌కు చెందిన న‌కిలీ నోట్లే ఎక్కువ‌గా స‌ర్క్యులేష‌న్‌లో ఉన్న‌ట్లు ఆర్బీఐ వెల్ల‌డించింది. 2022-23 సీజ‌న్‌లో రూ.500 డినామినేష‌న్‌కు చెందిన 14.4 శాతం న‌కిలీ నోట్ల‌ను గుర్తించిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది. గ‌త ఏడాది రూ.500కు చెందిన 91,110 నోట్ల‌ను గుర్తించిన‌ట్లు ఒక నివేదిక‌లో పేర్కొంది. ఇక అదే సంవ‌త్స‌ర కాలంలో రూ.2000 నోట్లలో కేవ‌లం 9806 నోట్లు మాత్ర‌మే న‌కిలీవేని వివ‌రాలు వెల్ల‌డించింది.. రూ.20కు చెందిన నోట్ల‌ల్లో కూడా 8.4 శాతం నోట్లు న‌కిలీవి దొరికిన‌ట్లు ఆర్బీఐ త‌న రిపోర్టులో తెలిపింది. ఇక రూ.10, రూ.1, రూ.2000 నోట్ల‌ల్లో న‌కిలీలు 11.6 శాతం ప‌డిపోయిన‌ట్లు ఆర్బీఐ పేర్కొన్న‌ది. ఫేక్ ఇండియ‌న్ క‌రెన్సీ నోట్స్ ప్ర‌కారం 2022-23లో 2,25,769 ఫేక్ నోట్లు రాగా, అంత‌కుముందు ఏడాది 2,30,971 న‌కిలీ నోట్లు వ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ త‌న నివేదిక‌లో తెలిపింది. ఫేక్ నోట్ల‌లో 4.6 శాతం నోట్ల‌ను రిజ‌ర్వ్ బ్యాంక్ గుర్తించ‌గా, ఇత‌ర బ్యాంకులు 95.4 శాతం నోట్ల‌ను గుర్తించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement