Thursday, May 2, 2024

నకిలీ విపత్తు..

  • సంగారెడ్డి జిల్లాలో నకిలీ విత్తన మాఫియా
  • తూతూ మంత్రంగా అధికారుల దాడులు
  • రెచ్చిపోతున్న వ్యాపారులు.. నష్టపోతున్న రైతులు
  • తాజాగా రైతు ఫిర్యాదుతో బట్టబయలైన నకిలీ పురుగు మందుల వ్యాపారం

ప్ర‌భ న్యూస్ బ్యూరో, ఉమ్మ‌డి మెద‌క్ : ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులకు నష్టాలే మిగుతులుతున్నాయి. పంట సాగు సమయంలో నకిలీ విత్తనాలు, ఎరువులు బెడద.. పంట చేతికి వచ్చాక దళారుల వలలో పడి నష్టపోతున్నారు రైతన్నలు. కొందరు రైతులు అనధికారికంగా ఏర్పాటు- చేసిన ఫర్టిలైజర్‌ షాపుల్లో విత్తనాలు కొని మోసపోతున్నారు. ఆ మందులను పంట పొలాల్లో పిచికారి చేసి నష్టపోతున్నారు. ఎక్కడో ఒక చోట బాధితులు ఫిర్యాదు చేస్తే తప్పా ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన ఓ రైతు అనుమతి లేకుండా విక్రయాలు జరుపుతున్న ఫర్టిలైజర్‌ షాపులో పురుగుల మందు కొనుగోలు చేసి పిచికారి చేశాడు. ఆ మందులు స్పే చేసిన తరువాత పంట పూర్తిగా నాశమైంది. దీంతో ఆ రైతు అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడి చేసి షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదు చేస్తే తప్పా అధికారులు దాడులు చేయరా? అనే అనుమానం పలువురు రైతులు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటి-కై-నా సంబంధిత అధికారులు స్పందించి ఫర్టిలైజర్‌ షాపుల్లో దాడులు చేపట్టి నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను కాపాడాలని కోరుతున్నారు.

నకిలీ విత్తనాల బెడద రైతులను వెంటాడుతుంది. ఏటా గ్రామాల్లో కొందరు అనధికారికంగా ఫర్టిలైజర్‌ షాపులను ఏర్పాటు- చేసి అందులో నకిలీ విత్తనాలు అమ్మి సొమ్ము చేసుకుంటు-న్నారు. ఈ విత్తనాలు మొలకెత్తవు, ఒకవేళ మొలకెత్తినా కాతపూత ఉండదు. దీంతో రైతులు లబోదిబోమని మొత్తుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పెట్టు-బడులు మీదపడి చాలా మంది రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తక్కువ ధరకు విత్తనాలు దొరుకుతాయని పంట దిగుబడులు ఎక్కువగా ఉంటాయంటూ మోసగాళ్లు నకిలీ సీడ్స్‌ అంటగడుతున్నారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట మండలంలో నకిలీ విత్తనాల వ్యాపారం గుట్టు- ర-్టటెంది. అనుమతి లేకుండా షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు చేసి నలికీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

రైతు ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం..
సదాశివపేట మండలం ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన రైతు నీరడి నగేష్‌ తన పంట చేనుకు గ్రామంలోనే అనుమతి లేకుండా విక్రయాలు జరుపుతున్న ఉదయ్‌ జైన్‌ వద్ద పురుగుల మందు కొనుగోలు చేసి పిచికారి చేశాడు. ఆ మందులు స్పే చేసిన తరువాత నాలుగున్నర ఎకరాల్లోని పంట పూర్తిగా నాశమైంది. దీనిపై గ్రామంలోని పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టగా పంట నష్టానికి సంబంధించి రూ.లక్షా ఇస్తానంటూ జైన్‌ తెలిపాడు. కాగా, నష్ట పరిహారం ఇస్తామని చెప్పి తొమ్మది నెలలు కాగా డబ్బు ఇవ్వాలని రైతు నగేష్‌ వ్యాపారిని అడుగగా ఏమి చేసుకుంటావో.. చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో రైతు నగేష్‌ వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. గత సంవత్సరం తన పంటకు చల్లిన పురుగు మందుల వల్ల సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లింది. నష్ట పరిహారం ఇస్తానని చెప్పిన వ్యాపారి మొండికేయడంతో రైతు నగేష్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదాశివపేట వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. అనధికారికంగా ఏర్పాటు- చేసిన ఫెస్టిసైడ్స్‌ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఆ దుకాణాన్ని తనిఖీ చేసిన అధికారులకు నిషేదిత మందులు, కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులు, నకిలీ విత్తనాలు కనిపించాయి. అదే విధంగా వీడీ సైట్స్‌, ్లగపో సెట్‌ వంటివి ఎలాంటి అనుమతి లేకుండానే విక్రయిస్తున్నట్లు- గుర్తించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ వ్యవసాయ శాఖ జిల్లా అధికారిని పంపించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శుక్రవారం దుకాణాన్ని తనిఖీ చేసి పలు రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను గుర్తించారు. అనుమతి లేకుండా విక్రయాలు సాగిస్తున్న వ్యాపారిపై 6-ఏ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు. వీటిని ఎక్కడి నుంచి తెచ్చారు.. ఎలా విక్రయిస్తున్నారనే విషయాలను తెలుసుకుంటు-న్నామని శనివారం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్న వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు. దాడుల్లో వ్యవసాయ శాఖ ఏడీఏ మనోహర, ఏఈవోలు శ్రీదేవి, కళ్యాణ్‌ దాస్‌, సదాశివపేట ఎస్సై సుదర్శన్‌, తదితరులు ఉన్నారు.

యథేచ్ఛగా దందా…
ఆత్మకూర్‌ గ్రామంలో యథేచ్ఛగా నకిలీ విత్తనాల దందాకు తెరలేపాడు వ్యాపారి ఉదయ్‌ జైన్‌. ఎలాంటి అనుమతి లేకుండా శ్రీ హలమ ట్రేడింగ్‌ కంపెనీ పేరిట ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాన్ని ఏర్పాటు- చేసి.. అందులో నకిలీ విత్తనాలు, పురుగు మందులు తయారు చేసి గత కొన్ని సంవత్సరాలుగా విక్రయిస్తున్నాడు. ఈ విషయం వ్యవసాయ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో తాను ఆడిందేఆట పాడిందే పాటగా గ్రామంలో సాగుతుండడంతో మరో అడుగు మందుకేసి ఆ వ్యాపారి ఏకంగా పెద్ద గోదాం ఏర్పాటు- చేశాడు. కాలం చెల్లిన మందులు, షాంపులు, చిన్నపిల్లలు తినే పదార్థాలతో ఎరువులు, పురుగు మందులు తయారు చేసి అమ్ముకుని సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. తన దగ్గర మందులు, ఎరువులు కొంటే డిస్కౌంట్‌ ఇస్తానంటూ గ్రామంలోని రైతులను నమ్మబలికించి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. సదాశివపేట మండల పరిధిలోని గ్రామాల్లోని రైతులు ఎక్కువగా పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పురుగు మందులు ఎక్కవగా కొంటారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారి జైన్‌ సుమారు రెండు వందలకు పైగా నకిలీ విత్తనాలు, పురుగు మందులను తయారు చేసి విక్రయిస్తున్నాడు. అంతే కాకుండా ఎలాంటి అనుమతి తీసుకోకుండానే దర్జాగా విక్రయిస్తూ రైతులను నిలువునా ముంచుతూ రూ.కోట్లు- ఆర్జించినట్లు- అధికారులు అనుమానిస్తున్నారు.

నకిలీ దందాపై ఉక్కుపాదం ఏదీ..?
సంగారెడ్డి జిల్లాలో నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనధికారికంగా గ్రామాల్లో వందలాది ఫర్టిలైజర్‌ షాపులు వెలుస్తున్నా అధికారులు చూసీచూడనట్లు- వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి సైలెంట్‌ గా ఉండడానికి కారణం నెలనెలా మామూళ్లు అందుతున్నాయా అనే అనుమానం కలగక మానదు. వేతనాలు తీసుకుని పని చేసే అధికారులే లంచాలకు మరిగితే ఎలాంటి వేతనం లేకుండా ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతు గోస ఎవరు పట్టించుకోవాలని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాల కొని రైతులు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు-చేసుకుంటు-న్నా అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటు-న్నారు. తాజాగా రైతు ఫిర్యాదుతో నకిలీ విత్తనాల దుకాణం గుట్టు- రట్టు- అయ్యింది. దీన్ని బట్టి చూస్తూ నష్టపోయిన రైతులు ఫిర్యాదు చేస్తే తప్పా అధికారులు తనిఖీలు చేపట్టరా అనే అనుమానాలు కలుగక మానవు. ఇప్పటి-కై-నా వ్యవసాయ, సంబంధిత అధికారులు స్పందించి నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వచ్చేది వానాకాలం సీజన్‌ కావడంతో ఈ మాఫియా మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని.. ఇకనైనా అధికారులు మేల్కొని జిల్లా వ్యాప్తంగా ఎరువులు, విత్తనాల దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement