Sunday, May 5, 2024

ఎఫ్3 నుండి ఫ‌స్ట్ సాంగ్ ప్రొమో

ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం ఎఫ్3. ఈ మూవీ ఎఫ్2కి సీక్వెల్. ఎఫ్3 చిత్రం నుండి ఫ‌స్ట్ సాంగ్ ప్రొమోని రిలీజ్ చేశారు. లబ్ లబ్ డబ్ అంటూ సాగే ఈ పాటలో పైసా ఉంటే లోకమంత పెద్ద డాన్స్ క్లబ్ అంటూ ఈ సాంగ్ కొన‌సాగింది. ఇక ర్యాప్ మాదిరిగా పాట ఉన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాటను ఈ మద్య కాలంలో తెగ ట్రెండ్ అవుతున్న సింగర్ రామ్ మిర్యాల ఆలపించాడు. పూర్తి పాటని ఫిబ్రవరి 7వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాట చిత్రీకరణ చూస్తుంటే చాలా రిచ్ గా అనిపిస్తుంది.

హీరో వెంక‌టేష్, వరుణ్ తేజ్ ల గెటప్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. పెద్ద ఎత్తున విదేశీ డాన్సర్స్ ను కూడా ఈ పాటలో దించారు. ఇది ఇద్దరు హీరోలు కలిసి పాడుకునే డ్రీమ్ సాంగ్ అయ్యి ఉంటుంది అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ పాట తో సినిమా పై అంచనాలు మరింత పెరగడం ఖాయం అన్నట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమా ను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వెంకీకి జోడీగా ఎఫ్ 2 లో మాదిరిగా తమన్నా నటిస్తుండగా వరుణ్ కు జోడీగా కూడా మెహ్రీన్ నటిస్తుంది. వీరి కాంబో హిట్ టాక్ ను దక్కించుకుంది కనుక ఖచ్చితంగా పైసా వసూళ్ల్ అన్నట్లుగా ఎఫ్ 3 నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement