Thursday, May 2, 2024

విద్యుత్‌ ఉద్యోగుల పేరివిజన్‌ అభ్యర్ధనల స్వీకరణకు గడువు పెంపు..

అమరావతి, ఆంధ్రప్రభ: విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన సూచనలు, సలహాలను కమిషన్‌కు అందించేందుకు ఈనెల 13 వరకూ ఉన్న గడువును ఈనెల 30 వరకూ పొడగించారు. ఈమేరకు విద్యుత్‌ ఉద్యోగుల పే రివిజన్‌ కమిషన్‌ డాక్టర్‌ మన్‌మోహన్‌ సింగ్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకూ కొన్ని యూనియన్లు తమకు సంబంధించిన సూచనలు, సలహాలను కమిషన్‌కు పంపలేదని, అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని గడువు పెంచినట్లు పేర్కొంది. అయితే, తాము నిర్ణయించుకున్న సమయంలోగా ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉన్నందున ఏప్రిల్‌ 30 తరువాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించబోమని కూడా స్పష్టంచేసింది.

ఇప్పటివరకూ ఎవరైనా ఉద్యోగిగానీ, అసోసియేషన్లుగానీ, యూనియన్లుగానీ వారివారి అభ్యంతరాలను, సూచనలు తెలియపర్చనట్లయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. అయితే వారివారి సూచనలను ఈమెయిల్‌, వాట్సాప్‌ల ద్వారా కూడా పంపవచ్చని, అయితే, పంపిన తరువాత స్వయంగా కమిషన్‌ను కలిసి వాటిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. పీఆర్సీ2022పవర్‌ యుటిలిటీస్‌ ఎట్‌ ద రేట్‌ జీమెయిల్‌ డాట్‌ కాం అడ్రస్‌కు మెయిల్‌ ద్వారా గానీ లేదంటే 8500676988 నంబరుకు వాట్సప్‌ ద్వారాగానీ పంపాలని కమిషన్‌ కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement