Tuesday, June 11, 2024

Delhi: బెయిల్‌ మరో వారం రోజులు పొడిగించండి.. కేజ్రీవాల్‌ వినతి

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ వ్యవ‌హారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఆ బెయిల్ ను మ‌రో వారం రోజులు పొడిగించాల‌ని కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని పిటిషన్‌ వేశారు.

ఇటీవల ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ మంజూరు చేయమని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరడంతో జూన్‌ 1వ తేదీ వరకు సుప్రీం కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది.

ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయనకు ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయని, మరి కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్య బృందం తెలిపింది. సీఎం ఆరోగ్యానికి కీలకమైన వైద్య పరీక్షలు పూర్తి చేసేందుకు కేజ్రీవాల్ కు మరో ఏడు రోజులు బెయిల్‌ పొడిగించాలని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement