Saturday, April 27, 2024

ఎవరెస్ట్‌ 360 డిగ్రీస్‌.. వీడియో ట్వీట్​ చేసిన ఆనంద్​ మహీంద్ర

వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర తన ట్విట్టర్‌లో ఓ కొత్త పోస్టు పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్‌ ఎవరెస్ట్‌ నుంచి 360 డిగ్రీల కోణంలో తీసిన వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోకు ఓ భావాత్మక సందేశాన్ని జోడించారు. ఇది 360 డిగ్రీల కోణంలో మౌంట్‌ ఎవరెస్ట్‌ అని, కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, అలాంటి సమయంలో ఎవరెస్ట్‌పై ఉన్నట్లు భావిస్తామని, అవధులు లేని ప్రపంచాన్ని.. చాలా ఈజీగా చూసేస్తామని ఆయన తన వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. కొందరికి ఆ వీడియో ఆనందాన్ని ఇచ్చినా.. గ్లోబల్‌ వార్మింగ్‌ మరి కొందర్ని కలవరపెట్టింది. చాలా ప్రదేశాల్లో మంచు క్రమంగా తగ్గుతున్నట్లు వీడియో చూసిన యూజర్స్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement